కర్ణాటకలో రుణమాఫీ సంగతేంటీ..?:కేటీఆర్‌

239
ktr
- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో పొలిటికల్ హిట్ రోజురోజుకి పెరిగిపోయింది. అధికార టీడీపీ,కాంగ్రెస్‌ మధ్య రోజురోజుకి మాటల యుద్ధం తారాస్ధాయికి చేరుతోంది. కాంగ్రెస్‌ ఆరోపణలకు ధీటుగా బదులిస్తున్న టీఆర్ఎస్‌ నాయకులు సోషల్ మీడియా వేదికగా చురుగ్గా స్పందిస్తున్నారు.

ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌..మరోసారి ట్వీట్టర్‌ ద్వారా కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల సందర్భంగా టీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమి రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ అస్త్రాన్ని సంధించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామంటున్న కాంగ్రెస్..
ముందు కర్ణాటకలో ఆ పని చేయాలంటూ చురకలు అంటించారు.

తెలంగాణ ప్రజలకు కఠోరంగా అబద్దాలు చెప్పే కాంగ్రెస్.. కర్ణాటకలో రుణమాఫీ చేసిందా అని రాహుల్‌ని ప్రశ్నించారు. స్కాంగ్రెస్ రుణమాఫీపై తమ రెండు నాల్కల ధోరణి ఏంటో బయటపెట్టిందని… టీఆరఎస్ ప్రభుత్వం రైతులకు రూ.17వేల కోట్ల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు కేటీఆర్ . ఓ వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్‌తో జతచేశారు.

- Advertisement -