భారతీయులు ఎక్కువగా ఎక్కడ ఇన్వెస్ట్‌ చేస్తారో తెలుసా?

5
- Advertisement -

భారతీయులు తమ సంపాదనను ఎక్కడ ఎక్కువగా పెట్టుబడిగా పెట్టుతున్నారో ఎప్పటికప్పుడు అధ్యయనాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా వచ్చిన గణాంకాలు చూస్తే, భారత ప్రజలు ఇప్పటికీ సురక్షిత పెట్టుబడుల పట్లే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది. ప్రమాదం తక్కువగా ఉండే మార్గాలకే ప్రాధాన్యం ఇస్తూ, ఎక్కువ మంది ప్రజలు సంప్రదాయ సేవింగ్స్ పథకాలను ఎంచుకుంటున్నారు.

మొత్తం పెట్టుబడుల్లో 25.5 శాతం శాతం భాగం బ్యాంకుల్లోనే ఉండటం విశేషం. ఇది దాదాపు రూ. 6.5 లక్షల కోట్ల మేరకు ఉంది. సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇప్పటికీ భారతీయ కుటుంబాలకు ప్రధాన వనరుగా కనిపిస్తున్నాయి.

తదుపరి స్థానం ప్రావిడెంట్ మరియు పెన్షన్ ఫండ్స్‌దే. ఇవి మొత్తం పెట్టుబడుల్లో 22.7 శాతం, అంటే రూ. 5.8 లక్షల కోట్లు ఉంటాయి. భవిష్యత్తు భద్రత కోసం దీర్ఘకాలిక పెట్టుబడులుగా వీటిని ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

లైఫ్ ఇన్సూరెన్స్ కూడా భారతీయుల్లో ఎంతో ప్రసిద్ధి. మొత్తం పెట్టుబడుల్లో 17.2 శాతం, అంటే రూ. 4.4 లక్షల కోట్లు దీనికే వెళ్తాయి. కుటుంబ భద్రత కోసం ఇన్సూరెన్స్‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. చిన్న సేవింగ్స్ పథకాలు – పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ వంటి వాటిలో 13.3 శాతం (రూ. 3.4 లక్షల కోట్లు) పెట్టుబడి చేస్తున్నారు. ప్రభుత్వం నడిపే పథకాలపై ప్రజలకు విశ్వాసం ఎక్కువగా ఉంది.

కరెన్సీ రూపంలోనే దాచుకునే మొత్తమూ తక్కువ కాదు. ఇది 10.5 శాతం (రూ. 2.5 లక్షల కోట్లు) వరకు ఉంది.మ్యూచువల్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో 6.3 శాతం మాత్రమే, అంటే రూ. 1.6 లక్షల కోట్లు, ఈక్విటీలలో మాత్రం కేవలం 1.9 శాతం (రూ. 48,613 కోట్లు) మాత్రమే పెట్టుబడి చేస్తున్నారు.

ఇక నాన్ బ్యాంకింగ్ డిపాజిట్లు 1.6 శాతం (రూ. 41,560 కోట్లు) స్థాయిలో ఉన్నాయి.ఈ గణాంకాలు చూస్తే, భారతీయులు ఇప్పటికీ ప్రమాదం తక్కువ ఉన్న పెట్టుబడులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని స్పష్టమవుతోంది.

Also Read:TTD:30న భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

- Advertisement -