TTD:30న భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

5
- Advertisement -

టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో న‌వంబరు 30వ తేదీన తిరుప‌తి అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. టీటీడీ విద్యాసంస్థ‌ల‌తో పాటు తిరుప‌తిలో స్థానికంగా చ‌దువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్న‌వ‌చ్చు.

ఇందులో భాగంగా భ‌గ‌వ‌ద్గీత 14వ అధ్యాయం (గుణత్రయ విభాగ యోగం)లో 6 నుండి 9వ త‌ర‌గ‌తి విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగాను, మరో విభాగంలో 10వ త‌ర‌గ‌తి విద్యార్థినీ విద్యార్థులకు 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగంపై పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.

అలాగే, 18 నుండి 45 సంవత్సరాల లోపు వారికి నిత్యజీవితంలో భగవద్గీత – భావ విశ్లేషణ అనే అంశంపై పోటీలు నిర్వహించనున్నారు.

ఆస‌క్తిగ‌ల‌వారు న‌వంబ‌రు 30న ఉద‌యం 9 గంట‌ల‌కు తిరుపతి అన్న‌మాచార్య క‌ళామందిరంకు చేరవ‌లెను. మ‌రిన్ని వివ‌రాల‌కు 9676615643, 8500049345 నంబ‌రుకు సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి గీతాజయంతి సందర్భంగా డిసెంబ‌రు 1వ తేదీన బహుమతులు ప్రధానం చేస్తారు.

Also Read:నియోపోలీస్ భూముల వేలం..రూ.1352 కోట్ల ఆదాయం

- Advertisement -