ఎన్టీఆర్ అప్పుడు మాట్లాడతాడేమో!

45
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై జూనియర్ సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు బాబు బయటకు వచ్చాడు. పైగా ఈ మధ్య బాబు క్రేజ్ బాగా పెరిగినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించే మాటలు కోటలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం కళ్యాణ్ రామ్ ఒక్కడే నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నిజానికి కళ్యాణ్ రామ్ కూడా బాబు అరెస్ట్ పై ఏ మాట మాట్లాడలేదు. కానీ, రిలీజైన వెంటనే వెళ్లి కలిశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ?. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

తెలుగు తమ్ముళ్లు.. ముఖ్యంగా బాబు అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ పై మళ్లీ విరుచుకు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు తారక్ అభిమానులు దీటుగా సమాధానం ఇస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు ?, అసలు ఎన్టీఆర్ ఉద్దేశ్యం ఏమై ఉంటుంది ?, నిజానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో పునాదులు పటిష్టంగా వేస్తున్నట్లుగా పలు సంకేతాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఐతే, ఎన్టీఆర్ మాత్రం నేరుగా రాజకీయాల గురించి ప్రస్తావించలేదు.

కాకపోతే, ఆ మధ్య ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులు కొందరు రాజకీయ మీటింగ్స్ పెట్టడం, ఎన్టీఆర్ పేరుతో పలు సేవా కార్యకలాపాలు చేయడం.. ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని అంటున్నారు. నో డౌట్. ఎన్టీఆర్ కి ఉన్న టాలెంట్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. జూ.ఎన్టీఆర్ ని నటుడిగా ఇష్టపడే అభిమానులు లక్షల మంది వున్నారు. ఇక టీడీపీ బలం కూడా ఎన్టీఆర్ కి తోడు అయితే కచ్చితంగా రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంది. పైగా టీడీపీ నాయకులు, లోకేష్ కంటే ఎన్టీఆర్ చాలా బెటర్. కాబట్టి.. భవిష్యత్తులో టీడీపీ పార్టీ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి అప్పుడే ఎన్టీఆర్ మాట్లాడతాడేమో !!.

Also Read:KTR:టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించొచ్చు

- Advertisement -