కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడో మరి?

20
- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం పోలిటికల్ హీట్ తీవ్ర స్థాయిలో నెలకొంది. ఇటీవల అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ తొలి జాబితా అభ్యర్తులను ప్రకటించడంతో ఈ రాజకీయ వేడి పతాకస్థాయికి చేరుకుంది. 119 స్థానాలకు గాను ఏకంగా 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసిరారు అధినేత కే‌సి‌ఆర్. ఇక బి‌ఆర్‌ఎస్ తరుపున నిలబడే గెలుపు గుర్రాలు ఎవరో తేలిపోవడంతో ఇప్పుడు అందరి చూపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై పడింది. ఈ రెండు పార్టీల నుంచి బరిలో నిలిచే అభ్యర్థులేవారు ? పార్టీ అధిష్టానలు ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఈ పార్టీలు తుది కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. .

కాంగ్రెస్ ఇప్పటికే టికెట్లు ఆశించే ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాగా 70 స్థానాలలో ఇప్పటికే టికెట్లు కూడా కన్ఫమ్ చేసినట్లు సమాచారం. ఇక ఈనెల 25 నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. ఆ తరువాత అంతర్గత చర్చల అనంతరం వచ్చే నెలలో హస్తం పార్టీ తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు కమలం పార్టీ ఇంకా అభ్యర్థుల ఖరారు విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతుందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ ఉన్నప్పటికి సరైన అభ్యర్థుల కొరత ఆ పార్టీని గట్టిగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఎలా ఉండబోతుందనేది చూడాలి. మొత్తానికి అన్నీ ప్రధాన ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల మూడ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈసారి కూడా తెలంగాణ ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:దొంగ ఓట్లే జగన్ బలమా?

- Advertisement -