AQI (Air Quality Index) 400 దాటితే అది “సీవియర్” స్థాయి కాలుష్యంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో గాలిలో ఉన్న విషపూరిత కణాలు శరీరంలోకి లోతుగా ప్రవేశించి ఊపిరితిత్తులకు భారీ నష్టం చేస్తాయి.
1. PM2.5 కణాలు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరి రక్తంలోకి వెళ్లిపోతాయి
గాలిలో ఉన్న PM2.5, PM10 అనే సూక్ష్మ కణాలు ముక్కు, గొంతు ఫిల్టర్లను దాటి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి.సహ్యాద్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుణెకు చెందిన డా. నానా కుంజీర్ చెప్పినట్లుగా:“ఈ కణాలు అంత చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి తరువాత రక్తంలోకి కూడా కలుస్తాయి.”ఇవి ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ కలిగించి ఆక్సిజన్ మార్పిడిని దెబ్బతీస్తాయి.
2. ఊపిరితిత్తుల నేచురల్ ఇమ్యూనిటీ కూలిపోతుంది – ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయి
ఊపిరితిత్తులలో cilia అనే సూక్ష్మ రోమాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, మ్యూకస్, కాలుష్యాన్ని బయటికి తరిమేస్తాయి. కానీ AQI 400 దాటితే ఇవి పాడైపోతాయి లేదా స్తంభించిపోతాయి.“సీలియా దెబ్బతింటాయి… దాంతో ఇన్ఫెక్షన్లకు రక్షణ తగ్గిపోతుంది,”.దీంతో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు అందరికీ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. లాన్సెట్ పరిశోధన ప్రకారం, దీర్ఘకాలంగా PM2.5 ఎక్స్‌పోజర్ ఉన్నవారిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 44% వరకు పెరుగుతాయి.
3. బ్రాంకైటిస్, ఆస్తమా తీవ్రంగా పెరుగుతాయి
PM కణాలు ఊపిరితిత్తుల లోపలి పొరను మార్చేస్తాయి. దీర్ఘకాల ఎక్స్‌పోజర్ బ్రాంకైటిస్‌కు దారితీస్తుంది.PM10 దీర్ఘకాల ఎక్స్‌పోజర్ వల్ల బ్రాంకియల్ లైనింగ్ రియాక్టివ్ అవుతుంది… దాంతో క్రానిక్ బ్రాంకైటిస్ వస్తుంది. ఆస్తమా, COPD ఉన్నవారికి ప్రమాదం మరింత ఎక్కువ.
4. న్యూమోనియా ప్రమాదం భారీగా పెరుగుతుంది
స్మాగ్ వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ పెరిగి న్యూమోనియాకు దారితీస్తుంది. ఇలాంటి గాలిని నిరంతరం శ్వసించడం వల్ల శ్వాసకోశ ఇన్ఫ్లమేషన్ పెరిగి న్యూమోనియా అవకాశాలు అధికమవుతాయి,” అని డా. కుంజీర్ చెబుతున్నారు.
5. కాలుష్యం ఊపిరితిత్తులు మాత్రమే కాదు, మీ ఇమ్యూనిటీకే దెబ్బ
కాలుష్య గాలివల్ల శరీరం స్ట్రెస్‌లోకి వెళ్లి ఇమ్యూనిటీ బలహీనపడుతుంది.పరిశోధనల ప్రకారం PM2.5 కారణంగా రక్తంలో రక్షణ కణాలు తగ్గిపోతాయి, వాటి పనితీరు మందగిస్తుంది.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
()పిల్లలు
()వృద్ధులు
()ఆస్తమా/COPD రోగులు
()స్మోకర్లు
()డయాబెటిస్ రోగులు
()గర్భిణీలు
Also Read:ఆంధ్ర కింగ్ తాలూకా… అదిరే రెస్పాన్స్
మీ ఊపిరితిత్తులను ఎలా రక్షించుకోవాలి?
()బయటకు వెళ్తూ AQI చెక్ చేయండి
()AQI “severe” అయితే బయట వ్యాయామం చేయవద్దు
()ఎప్పుడూ N95 మాస్క్ వాడండి
()ఫ్లూ, న్యూమోనియా వ్యాక్సిన్లు వేయించుకోండి
()యాంటీ ఆక్సిడెంట్ ఆహారం (పండ్లు, కూరగాయలు) ఎక్కువగా తీసుకోండి
()నీరు ఎక్కువ తాగండి
()శ్వాస సంబంధిత వ్యాధులకు మందులు తప్పకుండా కొనసాగించండి
AQI 400 దాటితే ప్రతి ఊపిరితో కూడ నష్టం జరుగుతుంది. స్మాగ్ తగ్గినా, ఊపిరితిత్తుల్లో జరిగిన నష్టం అలాగే ఉండే అవకాశముంది.

