కొత్త ఫీచర్స్‌తో వాట్సాప్…

170
WhatsApp will add new feature
- Advertisement -

వాట్సాప్…ప్రస్తుతం మన జీవితంలో ఒక భాగం అయ్యింది. ఏదైనా ఇప్పుడున్న రోజుల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే లేదంటే పట్టించుకోవటం మానేస్తారు. అందుకే ఫేస్బుక్, వాట్సాప్ ఎప్పటికప్పుడు జనాలకు నచ్చినట్టు అప్డేట్ అవ్వబట్టే అందరి చేతుల్లోనూ అవే కొనసాగుతున్నాయి. ఇక తాజాగా మరో ఫీచర్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది వాట్సాప్.

ప్రస్తుతం వాట్సాప్‌లో మీరు ఎవ‌రికైనా పొర‌పాటున ఏదైనా మెసేజ్ పంపితే..?వాటిని రీకాల్ చేసుకోవడం కుదరాదు. కానీ ఇకపై ఆ టెన్షన్ వద్దు. ఎందుకంటే వాట్సాప్ తాజాగా తీసుకురాబోతున్న ఫీచర్‌తో వాటిని రీకాల్ చేసుకోవచ్చు. అంటే పోరపాటున పంపిన మెసేజ్‌లను,వీడియోలను, ఇమేజ్‌లను ఇకపై వెనక్కి తీసుకోవచ్చు. లేదా డిలిట్ చేయవచ్చు.

అయితే అందుకు కేవ‌లం 5 నిమిషాల గ‌డువు మాత్ర‌మే ఉంటుంది. ఆ స‌మయంలోపే అలా పొర‌పాటుగా పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయ‌వ‌చ్చు. ఆ స‌మ‌యం దాటితే మెసేజ్‌ను డిలీట్ చేయ‌డానికి వీలుండ‌దు. త్వ‌ర‌లో రానున్న కొత్త అప్‌డేట్‌లో ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ యూజ‌ర్ల‌కు అందించ‌నుంది.

ఇక ఐఫోన్‌ల‌లో వాట్సాప్‌ను వాడుతున్న వారి కోసం కొత్త అప్‌డేట్ విడుద‌లైంది. ఈ అప్‌డేట్ ద్వారా యూజ‌ర్ల‌కు కొత్త ఫీచర్లు ల‌భిస్తున్నాయి. ఆల్బమ్స్‌, ఫిల్ట‌ర్స్‌, రిప్లై షార్ట్‌క‌ట్ అనే మూడు కొత్త ఫీచ‌ర్లు ఈ అప్‌డేట్‌లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. వాట్సాప్‌లో యూజ‌ర్‌కు ఒకేసారి వ‌చ్చే ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లు అన్నీ క‌లిపి ఒకే ఆల్బంగా ఆటోమేటిక్‌గా మారుతాయి. ఆ ఆల్బ‌మ్‌ను ఓపెన్ చేస్తే అందులో ఆ ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు ఉంటాయి.

ఇక ఫిల్ట‌ర్స్ ఫీచ‌ర్ ద్వారా ఐఫోన్‌లో వాట్సాప్‌తో ఫొటోలు, వీడియోలు తీసిన‌ప్పుడు వాటికి ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడే ఫిల్ట‌ర్ల‌ను అప్లై చేసుకోవ‌చ్చు. దీంతో ఫొటోలు, వీడియోలు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. ప్ర‌స్తుతం పాప్‌, బ్లాక్‌, వైట్‌, కూల్‌, క్రోమ్‌, ఫిలిం అనే ఫిల్ట‌ర్లు ల‌భిస్తున్నాయి. ఇక 3వదైన రిప్లై షార్ట్‌క‌ట్ స‌హాయంతో యూజ‌ర్ త‌న‌కు వ‌చ్చే మెసేజ్‌ల‌కు సుల‌భంగా రిప్లై ఇవ్వ‌వ‌చ్చు. అందుకు గాను మెసేజ్‌ల‌పై కుడి వైపుకు స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్‌డేట్‌ను ఐఫోన్ యూజ‌ర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. వాట్సాప్ వెర్ష‌న్ 2.17.30 నంబ‌ర్‌లో ఈ అప్‌డేట్ ల‌భిస్తోంది.

- Advertisement -