ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ తాజాగా యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది.
వాట్సాప్ లో వాయిస్ నోట్ మెసేజ్ పేరుతో యూజర్లకు ఈ-మెయిల్ పంపుతున్నారు. ఆ మెసేజ్ ను క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయిపోతాయని జాగ్రత్తగా ఉండాలని యూజర్లకు సూచించింది.
వాట్సాప్ సంస్థ పంపినట్లుగా ఉండే ఆ లింక్‌ను క్లిక్ చేస్తే మన డివైజ్‌లో సైబర్ నేరగాళ్లకు సంబంధించిన మాల్వేర్ ఆటో మేటిక్ గా ఇన్స్టాల్ అవుతుంది. కట్ చేస్తే.. మన బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకుని సైబర్ కేటుగాళ్లు డబ్బును లూటీ చేస్తున్నారు. ఇప్పటికే 28 వేల మందికి పైగా ఇలాంటి మెసేజ్ వచ్చిందని…ఇటువంటి మెయిల్స్‌ను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.