Whatsapp:స్క్రీన్ షేరింగ్ ఫీచర్

52
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సాప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ మరిన్ని అద్భుతమైన ఫీచర్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది.

యూజర్ల సెక్యూరిటీ, వీడియో కాల్ చేసే సమయంలో యూజర్లు తమ స్క్రీన్లను షేర్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వనుంది. ప్లాట్‌ఫారమ్ పాస్‌వర్డ్ రిమైండర్ ఫీచర్‌ను కూడా జోడించాలని ప్లాన్ చేస్తోంది.

Also Read:ప్రతిరోజూ పరిగెత్తితే.. ఎన్ని ప్రయోజనాలో..!

కాల్ కంట్రోల్ వ్యూలో ప్రత్యేక సింబల్ ద్వారా వీడియో కాల్స్ సమయంలో తమ స్క్రీన్లను షేర్ చేసుకుంటారు. ఈ ఫీచర్ గూగుల్ మీట్, జూమ్ యాప్ మాదిరిగానే స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌లా పని చేస్తుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత, వీడియో కాల్స్‌లో పాల్గొనేవారు కంటెంట్ చూడటంతో పాటు రికార్డ్ కూడా చేసుకోవచ్చు.వాట్సాప్ స్టేటస్ Archive అనే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకురానుంది.

Also Read:Avinash Reddy : తేలేది నేడే?

- Advertisement -