వాట్సాప్ మరో అదిరే ఫీచర్..

253
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ అదిరే ఫీచర్స్‌తో ముందుకురాబోతుంది.

ఒకే నంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లతోపాటు.. మరో రెండు డివైస్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్‌ చేసుకోవడానికి యూజర్లకు అనుమతినివ్వనుంది. ఈ సేవను ఎనేబుల్ చేసేలా కంపానియన్ మోడ్ అనే ఫీచర్‌ని తీసుకురాబోతోంది.

కొంతమంది బీటా టెస్టర్ల కోసం ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా.. మొబైల్, డెస్క్‌టాప్‌లో ఏకకాలంలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చని తెలిపింది. ‘లింక్ డివైస్’ ఆప్షన్ ద్వారా రెండో స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ అందిస్తుంది. ప్రస్తుతం క్యూఆర్‌ కోడ్ స్కానింగ్ ద్వారా డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ సేవలను పొందుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -