వాట్సాప్ కొత్త ఫీచర్ ఇదే…

209
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా చరవాణుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో పాటుగా చాటింగ్ కోసం కొత్త కొత్త యాప్స్‌ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుసరించి కొత్త కొత్త అప్‌డెట్‌లు కూడా వస్తున్నాయి. దీంట్లో భాగంగా వాట్సాప్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక కొత్త అప్‌డెట్ వచేసింది. మనం వాట్సాప్ లో స్టేటస్‌ కొసం టెక్స్ట్‌ రాస్తాము కానీ ఇక నుంచి వాయిస్‌ చేస్తే చాలు దాని ద్వారా ఒక కొత్త అల్గారిథమ్ ద్వారా టెక్స్ట్‌గా మారిపోతుందని…ఇది కేవలం వాట్సాప్ యాప్ iosబీటా వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ ఉందని తెలిపింది. అన్న రకాల ముబైల్ ఫోన్‌లోకి రావడానికి ఇంకోంచెం టైమ్‌ పడుతుందని అంటున్నారు.

Wabetainfo ప్రకారం.. ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్‌ బీటాలో ఫీచర్ అందుబాటులో లేదు. బీటా కోసం iOSలో ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ద్వారా లాంచ్ చేసింది. వాట్సాప్ యూజర్లు మీ స్టేటస్ అప్‌డేట్‌లకు టెక్స్ట్‌తో 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేయగలరని నివేదిక వెల్లడించింది. మీరు మీ టెక్ట్స్‌ టైప్ చేసే దగ్గర కనిపించే మైక్రోఫోన్ ఐకాన్‌పై Tap చేయవచ్చు.

మీరు ఎంచుకున్న యూజర్లకు మాత్రమే మీ వాయిస్ స్టేటస్ అప్‌డేట్‌లు షేర్ అవుతాయి. ఎల్లప్పుడూ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసేందుకు వాట్సాప్‌ బీటా నివేదించింది. మీ స్టేటస్ అప్‌డేట్‌లకు 30 సెకన్ల వరకు వాయిస్ నోట్‌ను పోస్ట్ చేయవచ్చు. వాట్సాప్‌ కాల్స్‌ ట్యాబ్ణు యాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌కు తీసుకువచ్చేందుకు కూడా కృషి చేస్తోంది. వినియోదారులు ఇప్పుడు డెస్క్‌టాప్‌ యాప్‌ నుంచి నేరుగా కాల్‌ చేసే సదుపాయం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది.

ఇవి కూడా చదవండి…

డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు

రష్యాపై తీర్మానం చేసిన ఈయూ…

రామప్ప తెలంగాణ వారసత్వము:వీ.ప్రకాశ్‌

- Advertisement -