Whatsapp:ఇకపై హై క్వాలిటీ

52
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సాప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న…తాజాగా మరో కొత్త ఫీచర్‌ని తీసుకురానుంది.

ఇప్పటివరకు వాట్సాప్‌ హై క్వాలిటీ ఫోటోలను సపోర్ట్ చేసేది కాదు. అంతేకాదు హై క్వాలిటీ ఫోటోలను, వీడియోలను ఆటోమేటిక్‌గా కంప్రెస్ చేసేది. అందుకే ప్రతి ఫోటోలోనూ క్లారిటీ, క్వాలిటీ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోయేది. అతి త్వరలో తీసుకొచ్చే లేటెస్ట్ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చని వివరించింది.

Also Read:పవన్ విజయ యాత్ర.. లక్ష్యమదే !

ఇకపై యూజర్లు ఫోటోలను ఇతరులకు పంపే సమయంలో ‘హై క్వాలిటీ’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో మీరు పంపే ఫోటోకు హై క్వాలిటీ ఫోటో అనే ట్యాగ్ వస్తుంది. అది రిసీవ్ చేసుకున్న వారికి కూడా హై క్వాలిటీ ఫోటో అని తెలుస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఫోటోల వరకే పరిమితం చేస్తున్నట్లు సమాచారం..

ముందుగా ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లలో కొందరు బీటా వర్షన్ వారికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి WaBetainfo స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక యూజర్లు హై క్వాలిటీ ఫోటోలను ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇతరులకు కూడా సులభంగా పంపుకోవచ్చు.ఆండ్రాయిడ్ యూజర్లు 2.23.12.13 వాట్సాప్ బీటా, IOS యూజర్లు 23.11.0.76 వాట్సాప్ బీటా ఫీచర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఈ లేటెస్ట్ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే దీని కోసం మరికొంత సమయం ఎక్కువగా పట్టొచ్చు.

Also Read:బీజేపీ ” సినీ గాలం “.. వర్కౌట్ అవుతుందా ?

- Advertisement -