ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ వినియోగదారుల సేఫ్టీ కోసం సరికొత్త ఫీచర్‌నితీసుకురాబోతుంది.
యూజర్స్ ప్రైవసీకి పెద్దపీట వేస్తూ పలు రకాల ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్ ఈ క్రమంలోనే మరో కోత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వాట్సాప్ చివరిసారి ఎప్పుడు ఓపెన్ చేశారన్న విషయం తెలుసుకునేలా ‘లాస్ట్ సీన్’ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ ఆప్షన్‌లో భాగంగా కేవలం ‘ఎవ్రీ వన్, మై కాంటాక్ట్స్, నోబడీ’ ఆప్షన్‌లు మాత్రమే ఉన్నాయి.
కానీ తాజాగా వాట్సాప్ తీసుకొచ్చే ఈ ఫీచర్‌లో లాస్ట్ సీన్‌ను మీకు నచ్చిన వారికి మాత్రమే కనిపించేలా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను కేవలం ఐవోస్ యూజర్లకోసం పరీక్షిస్తుండగా త్వరలో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.