వాట్సాప్…మరో సరికొత్త ఫీచర్

61
whatsapp
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ వినియోగదారుల సేఫ్టీ కోసం సరికొత్త ఫీచర్‌ని తీసుకువచ్చింది.

మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఒక ప్రధాన అప్‌డేట్‌లో, వినియోగదారులు వారి వాట్సాప్‌ ప్రొఫైల్‌ల కోసం కవర్ ఫోటోలను సెట్ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేయడం ప్రారంభించినట్లు ప్రకటించింది.

ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగదారులు వారి ప్రొఫైల్ ఫోటోలను మాత్రమే పెట్టుకోవచ్చు. కానీ ఫేస్‌బుక్‌లో పెట్టుకునే కవర్‌ ఫోటో మాదిరిగా వాట్సాప్‌లో అలాంటి ఫీచర్‌ లేదు. ఇలాంటి ఫీచర్‌ను వాట్సాప్‌లో కూడా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది.అయితే ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యాప్ వినియోగదారులకు మాత్రమే. బిజినెస్‌ సెట్టింగ్‌ల క్రింద వినియోగదారులు అదనపు కెమెరా బటన్‌ను ఆప్షన్‌ను పొందుతారు. కొత్త కెమెరా బటన్‌ను ఉపయోగించి, వినియోగదారులు తమ ప్రొఫైల్‌లకు కవర్ ఫోటోలను సెట్‌ చేసుకోవచ్చు అని వెల్లడించింది.

- Advertisement -