మూడు రాష్ట్రాల ఎన్నికల అప్‌డేట్..

108
up
- Advertisement -

మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఉత్తరాఖండ్‌, గోవాలో ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. గోవా సీఎం ప్రమోద్ సావత్,మంత్రి విశ్వజిత్ రాణె ఓటు హక్కు వినియోగించుకోగా ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద,ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉదయం 9 గంటల వరకు యూపీలో 9.45,ఉత్తరాఖండ్‌లో 5.15 శాతం, గోవాలో 11.04 శాతం పోలింగ్ నమోదైంది.

గోవా‌ అసెంబ్లీలో 40 స్థానాలుండగా మొత్తం 11,56,464 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లో రెండో విడ‌తలో 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది.

ఇక ఉత్తరాఖండ్‌లో 13 జిల్లాల్లోని 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 632 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 152 మంది స్వతంత్రులు ఉన్నారు. రాష్ట్రంలోని 82,38,187 మంది ఓటర్లు వీరి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

- Advertisement -