ఫ్యామిలీ స్టార్ రిజల్ట్..వాట్ నెక్ట్స్ విజయ్?

28
- Advertisement -

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ ఫ్యామిలీ స్టార్ ‘. పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రెల్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి మొదటి రోజన మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో ఈ మూవీతో జస్ట్ యావరేజ్ హిట్ గానే నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో భారీ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా ఆశించిన హిట్ ఇవ్వలేదనే చెప్పాలి. గీతగోవిందం తర్వాత విజయ్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. దాంతో యూత్ లో విజయ్ క్రేజ్ పడిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం యువ హీరోలలో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు వరుస విజయాలతో క్రేజ్ పెంచుకుంటున్నారు. వీరి నుంచి విజయ్ కి గట్టి పోటీ ఎదురవుతోంది. దాంతో విజయ్ దేవరకొండ అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా హిట్ లిస్ట్ లో చేరకపోవడంతో విజయ్ నటించే నెక్స్ట్ సినిమాపైనే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. విజయ్ తన తరువాతి చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తో పాటు తనకు పెళ్లి చూపులు వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తో కూడా ఓ మూవీ చేయనున్నాడు విజయ్. ఈ మూవీస్ తోనైనా అదిరిపోయే సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. మరి అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి మూవీస్ తో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విజయ్ ఆ రేంజ్ విజయాలను మళ్ళీ ఎప్పుడు అందుకుంటాడో చూడాలి.

Also Read:టిల్లు కోసం వస్తున్న దేవర!

- Advertisement -