ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. రిలీజ్ డేట్‌పై కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్ పై క్లారిటీ ఇస్తూ.. మేకర్స్ ఈ సినిమాని డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చాలా గ్రాండ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి డిసెంబర్ 22 కి టార్గెట్ గా రాబోతున్న సలార్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పై ఎప్పటికప్పుడు న్యూస్ లు రావడము, ప్రభాస్ అభిమానులు డిస్పాయింట్ అవడము చూస్తున్నాము. క్రిస్మస్ కి విడుదల కాబోతున్న సలార్ షూటింగ్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ లు చకచకా చుట్టేస్తున్నారు.
అయితే, సలార్ నుంచి ఫస్ట్ సింగిల్ సర్ ప్రైజ్ ‘దసరా’ కన్నా ముందే రాబోతుంది అని టాక్ నడుస్తోంది. మరో వారం రోజుల్లో దసరా నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. కానీ, సలార్ టీం నుంచి ఫస్ట్ సింగిల్ పై ఎలాంటి అప్ డేట్ రావడం లేదు, ఈ సినిమాకు రవి బసూర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రవి బసూర్ ఈ ఫస్ట్ సింగిల్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట.. మ్యూజిక్ రెడీ కానీ విఎఫెక్స్ పని ఇంకా అవ్వలేదు.. త్వరలోనే ఆ గ్రాఫిక్స్ పని పూర్తి చేసి, సాంగ్ ను వదులుతారు అంటున్నారు.
ఏది ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ ను మాత్రం సలార్ టీమ్ బాగా నిరాశ పరుస్తోంది. అసలు ఓ వైపు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నా అప్ డేట్స్ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. ప్రభాస్ అభిమానులు మాత్రం సలార్ ఫస్ట్ సింగిల్ పై గంపెడు అసలు పెట్టుకున్నారు. ఈసారి కూడా రాకపోతే మాత్రం విషయం మాములుగా ఉండదు. అభిమానుల చేతిలో మేకర్స్ కి ఇత్తడే అంటున్నారు.
Also Read:కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా..

