‘2. ఓ’ టీజర్‌ రిలీజ్ ఆ రోజు కాదు..

291
rajini kanth
- Advertisement -

స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తికాగా గ్రాఫిక్స్ పనుల్లో వెనకపడటంతో ఈ మూవీ విడుదలకు మరింత సమయం పట్టోచ్చని సమాచారం. ఇక ఈ చిత్ర టీజర్ రిలీజ్‌ విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో అనేక వార్తలు ఊపందుకున్నాయి.

rajini kanth

ఈ టీజర్ గతంలోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. కాగా ఈ మూవీ టీజర్‌ను ఐపీఎల్-11 ఫైనల్‌ మ్యాచ్ ముంబాయి వాంకేడ్ స్టేడియంలో జరుగుతుండటంతో ఈ సందర్భంగా విడుదల చేస్తారని ఇటీవల వార్తలు జోరందుకున్నాయి. ఇలా వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది.

ఇలాంటి న్యూస్‌లో నిజం లేదని, అన్ని అవాస్తవాలే అని కొట్టిపారేశారు చిత్రబృందం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. శంకర్, రజినీ కాంబినేషన్‌లో వస్తున్నఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఆగస్టులో విడుదల సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -