Director Puri Jagannath:పూరీ.. నెక్స్ట్ ఏంటి ?

30
- Advertisement -

టాలీవుడ్ డైనమిక్ డాషింగ్ డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ కు ఉన్న గుర్తింపు ఏంటో అందరికీ త్లేసిందే. హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్ లో చూపించడంలో పూరీ జగన్నాథ్ తరువాతే ఎవరైనా. ఆయన సినిమాలలో ఉండే హీరోయిజం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇప్పటి టాప్ హీరోలు పూరీ సినిమాలతోనే తిరుగులేని మాస్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ కు బద్రి, మహేశ్ బాబు కు పోకిరి, రాంచరణ్ కు చిరుత, అల్లు అర్జున్ కు దేశముదురు, ప్రభాస్ కు బుజ్జిగాడు, ఎన్టీఆర్ కు టెంపర్.. ఇలా ప్రతి స్టార్ హీరోకు వారి కెరియర్ లోనే టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమాలు ఇచ్చిన ఘనత ఒక్క పూరీ జగన్నాథ్ కే దక్కుతుంది.

అలాంటి డైరెక్టర్ ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో పూర్తిగా డీలా పడిపోయాడు. టెంపర్ తరువాత తీసిన అరడజన్ సినిమాలు ఫ్లాప్ కావడంతో స్టార్ హీరోలు పూరీతో మూవీ చేసేందుకు ఇంట్రస్ట్ చూపడం లేదు. ఇక మద్యలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినప్పటికి అది పూరీ మార్క్ విజయం కాదు. ఇక ఆ తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తీసిన ” లైగర్ ” మూవీ పాన్ ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఒక్కసారిగా పూరీ కెరియర్ మొత్తం డౌన్ గ్రేడ్ అయింది. పూరీ జగన్నాథ్ తో మూవీ చేసేందుకు యంగ్ హీరోలు సైతం వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. కాగా పూరీ ప్రజెంట్ చిరు, బాలయ్య, రామ్ వంటి హీరోల కోసం కథలు రాసే పనిలో ఉన్నాడని త్వరలోనే ఓ స్టార్ హీరోతో మూవీ పట్టాలెక్కించే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. అయితే అవేవీ కన్ఫర్మ్ కాలేదు.

Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. !

ఇక ప్రస్తుతం పూరీ ఓ యంగ్ హీరోతో మూవీ చేసే ప్లాన్ లో ఉన్నాడట. మాస్ కా దాస్ గా యూత్ లో తక్కువ టైమ్ లోనే మంచి క్రేజ్ సంపాధించుకున్న విశ్వక్ సేన్ తో పూరీ జగన్నాథ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వక్ కూడా పూరీతో మూవీ చేసేందుకు ఆసక్తిగానే ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగే ఈ ఏడాది ఆగష్టు లోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందట. మరి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ విశ్వక్ సేన్ తో మూవీ ఒకే అయితే ఈ సినిమాతోనైనా పూరీ జగన్నాథ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read:శరీరం చల్లబడాలంటే.. ఇలా చేయండి!

- Advertisement -