పవన్ భజన.. బీజేపీకి పనికొస్తుందా?

45
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మద్య తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ ప్రకటించినది మొదలు కొని తెగ హడావిడి చేస్తున్నారు జనసేనాని. మొదట సింగిల్ గానే బరిలోకి దిగుతామని చెప్పిన పవన్.. ఆ తరువాత మాటమార్చి బీజేపీతో చేతులు కలిపారు. అయితే ఏపీలో మొదటి నుంచి బీజేపీ జట్టులో ఉన్న పవన్.. తెలంగాణలో మాత్రం బీజేపీతో సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరించారు మొదట్లో. కానీ అనూహ్యంగా ఆ పార్టీతో చేతులు కలిపి కాషాయ పార్టీకి తొత్తులా మారిపోయారు. తెలంగాణ విషయంలో తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలుస్తూ.. ఆయన వైఖరి ఎలాంటిదో చెప్పకనే చెబుతున్నారు. .

తాజాగా జరిగిన బీసీ బహిరంగ సభలో మోడీ సర్కార్ ను ఆకాశానికెత్తుతూ మోడి పై పొగడ్తల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను మోడి అగ్రగామిగా నిలిపారని, ప్రతి భారతీయుడి గుండెల్లో మోడీ ఉంటారని భజన చేస్తూ మోడీ పై పొగడ్తలు కురిపిస్తూ వచ్చారు. ప్రధాని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రనికి రాలేదని, అభివృద్దే ధ్యేయంగా వచ్చారని.. అబ్బో ఇలా పవన్ సరిగించిన భజన పర్వం అంతా ఇంతా కాదు. అయితే బీజేపీకి భజన చేయడం పవన్ నైజం అయినప్పటికి, తెలంగాణకు మోడి సర్కార్ చేసిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేదని సామాన్యులు వేస్తున్న ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పగలరా ? కొందరు రాజకీయ వాదులు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు.

నిధుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. పక్కా రాష్ట్రాలకు నిధులు తరలించిన మోడీ సర్కార్ వైఖరి ప్రజలు తెలియంది కాదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అసలు పట్టించుకొని పరిస్థితి.. తెలంగాణకు ఇంత అన్యాయం చేసిన మోడి సర్కార్ పై ప్రజలు ఏ స్థాయిలో అసంతృప్తి గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంది ఈ నేపథ్యంలో పవన్ కాషాయ పార్టీకి ఎంత భజన చేసిన ఆ పార్టీ పాతాళానికి పడిపోవడం ఖాయమని కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.

Also Read:కాలింగ్ సహస్త్రతో సందడి చేస్తాం: సుధీర్

- Advertisement -