పిల్లోడి డాన్స్‌కు కేటీఆర్ ఫిదా..

315
ktr
- Advertisement -

రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ పుడతడు చేసిన డాన్స్‌కు ఫిదా అయిపోయారు. డ్యాన్స్ చంపేశావ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.పిల్లాడు చేసిన ఆ డాన్స్ వీడియోను త‌న పేజీలో షేర్ చేశారు. డ్యాన్స్‌లో ఏం నైపుణ్యం ఉంది అంటూ ఆ పిల్లాడిని కొనియాడారు. పిల్లోడిని మెచ్చుకుంటూ ట్విట్టర్‌లో తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారు మంత్రి కేటీఆర్‌.

అసలు విషయానికొస్తే.. రెండు పెంపుడు కుక్కలు గేటు లోప‌ల ఉండి అరుస్తుండ‌గా ఓ పిల్లాడు గేటు బ‌య‌ట నుండి డ్యాన్స్ చేసి కాసేపు అంద‌రిని న‌వ్వించాడు. ఆ రెండింటిని పిల్లాడు ఆట ప‌ట్టించిన వీడియో తెగ న‌వ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోను వినేష్ ఖాటారియా అనే జ‌ర్న‌లిస్టు త‌న ట్విట్ట‌ర్ పేజీలో పోస్టు చేశాడు. ఈ క్రేజీ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసి కామెంట్ పెట్టారు.

- Advertisement -