వామ్మో.. రక్తం ఇన్ని రంగుల్లో ఉంటుందా?

232
- Advertisement -

సాధారణంగా రక్తం ఏ రంగులో ఉంటుంది అని అడిగితే ఎరుపు రంగులో ఉంటుందని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. కాగా కొందరిలో ముదురు ఎరుపు రంగులోనూ, మరికొందరిలో లేత ఎరుపురంగులో కూడా ఉంటుంది. అయితే ఎరుపు రంగు అనేది మాత్రం కమాన్ గా ఉంటుంది ప్రతిఒక్కరిలో. కాగా రక్తం ఇలా ఎరుపు రంగులో ఉండడానికి కారణం అందులోని హిమోగ్లోబిన్ అనే వర్ణం అనే విషయం అందరికీ తెలుసు. కానీ రక్తంలో కూడా చాలా రంగులే ఉన్నాయండోయ్ ! ఉదరంగు, ఆకు పచ్చ రంగు, నీలం రంగు, పసుపు రంగు ఇలా చాలా కలర్ లలో రక్తం ఉంటుంది. అయితే మనుషుల్లో కాదులెండీ.. ! మనుషుల్లో రక్తం ఎరుపు రంగులో ఉంటే పలు రకాల జంతువుల్లో ఆయా రంగుల్లో రక్తం ఉంటుంది. వాటి గురించి ఓ లుక్కేద్దాం పదండి !

1. నీలం రంగు
ఆక్టోపస్, మరియు కొన్ని రకాల సముద్ర జీవులతో పాటు సాలీడు వంటి వాటిలో రక్తం నీలి రంగులో ఉంటుంది. మన రక్తం లో ఎలాగైతే హిమోగ్లోబిన్ వల్ల రక్తం ఎరుపు రంగులో ఉంటుందో.. అలాగే వాటిలో కూడా హిమోషియన్ అనే వర్ణ పదార్థం వల్ల ఆ జీవులలో రక్తం నీలి రంగులో ఉంటుంది. ఈ పదార్థం యొక్క ముఖ్య పని రక్తం ద్వారా ఆక్సిజన్ ను శరీర భాగాలకు చేరవేయడం.

2. ఆకుపచ్చ రంగు.
కొన్ని రకాల బల్లులు, మరియు ఊసరవెల్లి జాతికి చెందిన కొన్ని జీవులలో రక్తం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ముఖ్యంగా న్యూగినియాలోని ఫ్రాసినోహిమా అనే బల్లి జాతికి చెందిన జీవులలో రక్తం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనికి కారణం వీటి శరీరంలో ఉండే బిలివర్దీన్ అనే వ్యర్థ పదార్థం. దీని వల్ల కేవలం రక్తమే కాదు వీటి శరీరంలోని నాలుక, కండరాలు, కళ్ళు, చర్మం వంటి అన్నీ భాగాలు కూడా ఆకుపచ్చ రంగులోనూ ఉంటాయి.

3. పసుపు రంగు
కొన్ని రకాల సముద్ర జీవిలలో రక్తం పసుపు రంగులో ఉంటుంది. ముఖ్యంగా సీ కుకుంబర్స్ ( సముద్రపు గొంగళి పురుగులు ) వంటి వాటిలో రక్తం పసుపు రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం వీటి శరీరంలో ఉండే వరాడియమ్ అనే పదార్థం. ఇది రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేసే హిమోసియన్ ద్వారా అన్నీ శరీర భాగాలకు చెరీ రక్తం యొక్క రంగును మార్చడంతో ఈ సముద్రగొంగళి పురుగులలో రక్తం పసుపు రంగులో ఉంటుంది.
.
4. ఉదా రంగు
సముద్రం లోని ఒక రకమైన జీవులలో అనగా మరిన్ వన్స్ ( ఎర్ర జాతికి చెందినవి ) వంటి జీవులలో రక్తం ఉదా రంగులో ఉంటుంది. వీటిలో రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే హేమెరిథ్ రిన్ అనే పదార్థం వల్ల ఈ జీవిలలో రక్తం ఉదా రంగులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -