ఆఫ్రిది వ్యాఖ్యలు కరెక్టే:రాజ్‌ నాథ్

221
rajnath afridi
- Advertisement -

కశ్మీర్‌ భారత్‌దే అని పాక్ క్రికెటర్ షాహిద్ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు కరెక్టే అని అన్నారు హోమంత్రి రాజ్ నాథ్ సింగ్. పాకిస్థాన్‌ తమ ప్రజలను మోసం చేసేందుకు కశ్మీర్‌ పై ద్వంద విధానాలను అవలంభిస్తోందన్నారు. ఆ దేశ ప్రజలకే రక్షణ కల్పించలేని పాక్ ప్రభుత్వం కశ్మీర్‌ను ఏవిధంగా అడుగుతుందన్నారు. కశ్మీర్ ఎప్పటికి భారత్‌దే అని స్పష్టం చేశారు రాజ్ నాథ్.

బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంగా మాట్లాడిన పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది కశ్మీర్‌ అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్‌ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలపైనా నిప్పులు చెరిగాడు. తమ నాయకులు ఉన్న నాలుగు రాష్ట్రాలనే సరిగా పాలించలేకపోతున్నారని, ఇక పాకిస్తాన్‌కు కశ్మీర్‌ ఎందుకని ప్రశ్నించాడు. లోయలో అమాయక ప్రజలు చనిపోతున్నారని అన్నాడు.ఉగ్రవాదుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడం తమ ప్రభుత్వాలకు చేత కాలేదన్నారు.

2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆఫ్రిది పాక్‌ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొన్న పాక్‌ జట్టుకు సారథిగాను వ్యవహరించాడు.

- Advertisement -