తెలంగాణలో సరిగ్గా ఎన్నికల ముందు రైతుబంధు నిధులకు ఈసీ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. రైతుబంధు నిధుల విడుదలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా అనూహ్యంగా నగదు జమ ఆగిపోయింది. అయితే రైతు బంధు నిధులు ఆగిపోయినందుకు ఎవరు అదైర్య పడవద్దని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు విడుదల చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. తొమ్మిదో తేదీన రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేస్తామని గట్టిగా చెప్పుకొచ్చారు. ఇక తొమ్మిదో తారీఖు రావడంతో రైతుబంధు కోసం ఆశగా ఎదురు చూశారు రైతులు. కానీ నిరాశే ఎదురైంది. .
నేడు తొమ్మిదో తారీఖు అయినప్పటికి ఇంతవరకు జమ కాలేదు. ఎప్పుడు రైతుబంధు నిధ్లు విడుదల చేస్తారనే దానిపై కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఒకింత అసహనంగా ఉన్నారు రైతులు. ఇకపోతే ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. తొమ్మిదో తారీఖు ఇస్తామన్న రైతు బంధు ఏమైందంటూ ప్రశ్నించారు. ఎకరానికి ఏడాదికి రూ.15,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఆ లెక్కన రూ. 7,500 చొప్పున జమ చేయాల్సి ఉందని, ఎప్పుడు జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఇచ్చిన హామీల అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి.. రైతుబంధు విషయంలో ఏమైనా క్లారిటీ ఇస్తారా ? లేదా అలాగే పెండింగ్ లో పెడతారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
Also read:పిక్ టాక్ : తమన్నా అందాల అరాచకం