వామ్మో.. బన్నీ లైనప్ అదిరిందిగా ?

38
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప మూవీ తరువాత నేషనల్ వైడ్ గా విస్తరించింది. ప్రస్తుతం బన్నీ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేసున్న పరిస్థితి. ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మూవీతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ అవ్వడంతో రెండవ భాగాన్ని మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ విడుదల పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేనప్పటికి కుదిరితే ఇదే ఏడాది డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది సమ్మర్ లో మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read: కాటుక కనుల దిశా ఇన్‌ ప్రాజెక్ట్‌ K

ఇక ఈ మూవీ తరువాత కూడా బన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ నే లైన్ లో పెట్టాడు. పుష్ప తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా మొదలైందట. ప్రస్తుతం మహేశ్ బాబుతో తీస్తున్న గుంటూరు కారం మూవీ పూర్తి కాగానే బన్నీ ప్రాజెక్ట్ పై కసరత్తు చేయనున్నాడట త్రివిక్రమ్. ఇక ఈ ప్రాజెక్ట్ తో పాటు సందీప్ రెడ్డి వంగ తో కూడా బన్నీ ఓ మూవీకి కమిటైనట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి మూవీస్ తో ఇండియా వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకున్నా సందీప్ రెడ్డి వంగ.. బన్నీ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ సిద్దం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తో చేయబోయే ” స్పిరిట్ ” మూవీ పూర్తి అయిన వెంటనే బన్నీ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడట సందీప్ రెడ్డి వంగ, వీరితో పాటు కొరటాల శివ, మరియు వేణు శ్రీరామ్ వంటి దర్శకులు కూడా అల్లు అర్జున్ లిస్ట్ లో ఉన్నారు. మొత్తానికి పుష్ప మూవీ తరువాత అల్లు అర్జున్ చేతిలో స్ట్రాంగ్ లైనప్ ఉన్నట్లే తెలుస్తోంది.

Also Read: Bunny:ఏఏఏ సినిమాస్ ప్రారంభం

- Advertisement -