గుడ్ లక్ దీదీ: మంత్రి కేటీఆర్

232
ktr mamatha
- Advertisement -

సీఎం కేసీఆర్ మానస పుత్రిక,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ బాటలో పలు రాష్ట్రాలు మిషన్ భగీరథను ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా తాజాగా బెంగాల్‌లో కూడాఈ పథకానికి అంకురార్పణ జరగనుంది.

జల్ స్వప్న పేరుతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించే పథకాన్ని ప్రారంభించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రూ.58 వేల కోట్ల వ్యయంతో ఐదేండ్లలో ఈ పథకాన్ని పూర్తిచేయాలని తృణమూల్ సర్కార్‌ సంకల్పించింది.

బెంగాల్‌ జల్‌స్వప్న ప్రాజెక్టు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఒకప్పుడు నేడు బెంగాల్‌ ఆలోచించింది.. రేపు ఇండియా ఆలోచిస్తుంది అనే చెప్పుకొనేవాళ్లు. అటువంటి బెంగాల్‌ ఇంటింటికీ తాగునీటి సరఫరా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన మిషన్‌ భగీరథను అనుసరించడం గర్వకారణం. గుడ్‌లక్‌ దీదీ అండ్‌ టీమ్‌’ అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు కేటీఆర్.

మిషన్‌ భగీరథ ప్రాజెక్టు గురించి తెలుసుకొనేందుకు 2015 నవంబరు 4వ తేదీన పశ్చిమ బెంగాల్‌ నుంచి ముగ్గురు సీనియర్‌ ఇంజినీర్లు హైదరాబాద్‌కు వచ్చి డీపీఆర్‌ను, ఫైనాన్స్‌ మోడల్‌ను అధ్యయనంచేశారు. అప్పటి పంచాయతీరాజ్‌ మంత్రి కేటీఆర్‌ను కలిసి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఇప్పటివరకు బెంగాల్‌తోపాటు బీహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ర్టాలు మిషన్‌ భగీరథను పరిశీలించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక సహకారం తీసుకొని తమ రాష్ర్టాల్లో ఇదే తరహా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి.

- Advertisement -