ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక విస్తృత రీషన్ (SIR) exerciseలో భాగంగా, వెస్ట్ బెంగాల్ ఓటర్ జాబితా నుండి మొత్తం 58.8 లక్షల పేర్లు తొలగించే అవకాశం ఉందని వర్గాలు వెల్లడించాయి. తాజా లెక్కల ప్రకారం, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు తీసుకుంటున్న ఈ శుద్ధి చర్యలో భాగంగా 58,08,202 పేర్లు తొలగింపుకు సిద్ధమవుతున్నాయి. గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన లెక్కింపులో ఈ సంఖ్య తేలిందని సమాచారం.
EC వర్గాల ప్రకారం, రాష్ట్రంలో 24,18,699 ఓటర్లు ఇప్పటికే మరణించినవారిగా గుర్తించారు.అదనంగా, 12,01,462 మంది చిరునామాలో లభ్యం కానివారుగా గుర్తించారు. ఒకే ఓటరు ఇంటికి బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) మూడు సార్లు వెళ్లి కూడా ఆ ఓటర్ని గుర్తించలేకపోతే, వారిని “missing voters” జాబితాలో చేర్చేస్తారు.
రాష్ట్రంలో 19,93,087 మంది చిరునామా మార్చిన ఓటర్లు ఉన్నారు. వారి పేర్లు రెండు చోట్ల కనిపించడం వల్ల, ఒక చోట పేర్లు తొలగించి సరైన జాబితాలో మాత్రమే ఉంచనున్నారు. ఎన్నికల కమిషన్ 1,37,575 మందిని మోసపూరిత ఓటర్లుగా గుర్తించింది. వారి పేర్లు కూడా డ్రాఫ్ట్ లిస్టులో ఉండవు. ఇంకా 57,509 మంది ‘other category’లోకి వెళ్లి, వారి పేర్లు కూడా తీసివేయబడతాయి.
Also Read:AP:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
డ్రాఫ్ట్ ఓటరు జాబితా డిసెంబర్ 16న ప్రచురించబడుతుంది. ఇందులో ఎవరైనా లోపాలు, అభ్యంతరాలు గమనిస్తే వాటిని కమిషన్‌కు తెలపచ్చు. అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి, ధ్రువీకరణ తర్వాత తుది జాబితా సిద్ధం చేస్తారు.రాష్ట్రంలో ప్రత్యేక విస్తృత రీషన్ (SIR) నవంబర్ 4 నుంచి ప్రారంభమై డిసెంబర్ 11 వరకు కొనసాగుతుంది.తుది ఓటరు జాబితా ఫిబ్రవరి 14, 2026న విడుదల కానుంది.
ఓటరు జాబితా రీషన్‌పై సీఎం మమతా బెనర్జీ వరుసగా ఎన్నికల కమిషన్, BJPపై విమర్శలు చేస్తూ, దేశవ్యాప్తంగా “వారి పునాది కంపించేలా చేస్తాను” అని హెచ్చరించారు.ఇదే సమయంలో, BJP మాత్రం మమతా బెనర్జీపై SIR ప్రక్రియను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేసింది.

