తెలుగు ఇండస్ట్రీలో మంచి రచయితగా పేరు తెచ్చుకున్న రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం టాలీవుడ్ లో సంచలనం రేపుతుంది. తనకు అవకాశాలు ఎక్కువగా రావడం లేదని మనస్ధాపానికి గురై ముంబైలోని ఓ హోటల్లో నిద్ర మాత్తలు మింగాడు. కొంచెం ఎక్కువ మోతాదులో మాత్రలు తీసుకొవడంతో అతని పరిస్దితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఒత్తిడికి లోనై ఈ దారుణానికి ఒడిగట్టారని ఫిలిం నగర్ వర్గాల టాక్. రాజసింహ రుద్రమదేవి సినిమాకు డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు. తెలుగు, హిందీ సినిమాలకు రైటర్ గా పనిచేసి పలు సినిమాలలో నటుడిగా కూడా చేశాడు.
ప్రేమించుకుందాం రా సినిమాతో డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు రైటర్ రాజసింహ. ఆ తర్వాత దర్శకుడు జయంత్ సి పరాన్జీ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా , రైటర్ గా పనిచేశాడు. అనంతరం మనసంతా నువ్వే నుండి శంకర్ దాదా ఎంబిబిఎస్ వరకూ పరుచూరి బ్రదర్స్ వద్ద ఆరు సంవత్సరాలు అసోసియేట్ రైటర్ గా పనిచేశాడు. ఆరోజుల్లో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన బొమ్మరిల్లు సినిమాకు రచయితగా పనిచేశాడు. రెండేళ్ల క్రితం దర్శకుడిగా మారి 2016లో సందీప్ కిషన్ , నిత్యామీనన్ జంటగా వచ్చిన ఒక్క అమ్మాయి తప్ప సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈసినిమాకు ఆశించిన స్ధాయిలో ఫలితం రాకపోవడంతో నిరాశ చెందాడు. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ముంబైకి వెళ్లిడు. అక్కడ కూడా ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు రాజసింహ.