దేశానికే ఆదర్శంగా కేసీఆర్ పాలన..

225
trs
- Advertisement -

సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలో నిర్వహించే సభ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. అభివృద్ధికి అడ్డుపడుతూ ప్రతిపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ..ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సీఎం కేసీఆర్ ఎన్నికలకు పిలుపునిచ్చారని వివరించారు.

కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని..నల్గొండ జిల్లా ప్రజల ఫ్లోరైడ్ బాధలను చూసే మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు పదవుల కోసం సీమాంధ్ర నేతల దగ్గర మొకరిల్లితే…ముష్టి 3 సీట్ల కోసం కోదండరాం కాంగ్రెస్ పార్టీకి పొర్లు దండాలు పెడుతున్నారని పల్లా విమర్శించారు.

అపవిత్ర పొత్తు విజయతీరాలకు చేరదని స్పష్టం చేశారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. టీడీపీ అవకాశవాదంతోనే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుందని ..ఎన్ని కూటములు పెట్టినా టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. మరోవైపు టీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -