వెయిటింగ్ లో చిరు దర్శకుడు

20
- Advertisement -

ఎప్పుడెప్పుడో హనుమాన్ జంక్షన్ సినిమా తీసి తెలుగులో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మోహన్ రాజా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వకపోయిన కమర్షియల్ గా ఫరవాలేదనిపించుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందు నాగార్జున కి ఓ కథ చెప్పాడు మోహన్ రాజా. గాడ్ ఫాదర్ టైమ్ లోనే నాగ్ తో ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. ఆ సినిమా అవ్వగానే మోహన్ రాజా నాగ్ సినిమాను డైరెక్ట్ చేస్తాడనే టాక్ వినిపించింది.

అయితే ఇప్పుడు నాగ్ ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా లాక్ చేసుకున్నాడు. మలయాళం రీమేక్ సినిమాకు డేట్స్ ఇవ్వబోతున్నాడు. అంటే మోహన్ రాజా సినిమాకి ఇంకా టైమ్ పట్టొచ్చు. కొన్ని నెలల క్రితమే నాగ్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసేశాడు మోహన్ రాజా. ఈ సినిమాలో అఖిల కూడా నటించనున్నాడు. స్టైలిష్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అఖిల్ కోసం ఓ స్పెషల్ కేరెక్టర్ డిజైన్ చేశాడు దర్శకుడు.

ఏదేమైనా గాడ్ ఫాదర్ సక్సెస్ తర్వాత వెంటనే తెలుగులో మరో సినిమా మొదలు పెడతాడనుకుంటే మోహన్ రాజా వెయిటింగ్ మోడ్ లోకి వెళ్ళాడు. నాగార్జున ప్రసన్న కుమార్ సినిమా పూర్తయ్యే వరకూ వెయిటింగ్ తప్పదు. మరి ఈ లోపు నాగ్ మరో సినిమా ఏమైనా సెట్స్ పైకి తెస్తే ఇక ప్రాజెక్ట్ డౌటే.

ఇవి కూడా చదవండి…

‘ఉస్తాద్’ మొదలు పెట్టనున్న పవన్?

NTR30 షూటింగ్ ఎప్పుడంటే?

పిక్ టాక్ : బాబోయ్ ఇవేం అందాలండోయ్

- Advertisement -