మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం..

362
ktr

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇన్‌ఫార్మల్ గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. కీపింగ్ పేస్ టెక్నాలజీ – టెక్నాలజీ గవర్నెన్స్ ఏట్ క్రాస్ రోడ్స్ పేరుతో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశానికి హాజరవ్వాలని మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపింది వరల్డ్ ఎకనామిక్ పోరం. సమావేశాల్లో రాష్ట్రస్ధాయి ఆహ్వానితుల్లో మంత్రి కేటీఆర్ ఒక్కరే ఉండడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. ప్రభుత్వాధినేతలు,కేంద్ర ప్రభుత్వాల్లో పాలసీ నిర్ణయించే సీనియర్ మంత్రులకు మాత్రమే సాధారణంగా సమావేశానికి ఆహ్వానం ఉంటుంది.