వీకెండ్ కావడంతో నేడు ఐపీఎల్ లో అభిమానులకు డబుల్ ట్రీట్ లభించనుంది. నాలుగు బడా జట్లు ఈ వేకెండ్ లో తలపడనున్నాయి. మొదటి మ్యాచ్ లో లక్నో తో గుజరాత్ తలపడనుంది. ఈ మ్యాచ్ అటల్ బిహారీ స్టేడియంలో మద్యాహ్నం 3:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఇక రెండవ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు జరగనుండగా ఈ మ్యాచ్ లో పంజాబ్ మరియు ముంబై జట్లు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్ లో తలపడబోయే లక్నో మరియు గుజరాత్ మద్య జరిగే పోరు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఇరు జట్లు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన లక్నో నాలుగు విజయాలు సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది.
ఇక ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఇరు జట్ల ప్లేయర్స్ కూడా అద్బుతమైన ఫామ్ లో ఉండడంతో నువ్వా నేనా అన్నట్లు తలపడడం ఖాయం. ఇక గత మ్యాచ్ లో రాజస్తాన్ పై విజయం సాధించిన లక్నో ఈ మ్యాచ్ లో విజయం సాధించి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాలని గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు గత మ్యాచ్ లో రాజస్తాన్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని కసిగా ఉంది. ఇక రాత్రి 7:30 నిముషాలకు జరిగే మ్యాచ్ లో ముంబై పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం వరుస విజయాలతో ముంబై ఫుల్ ఫామ్ లోకి వచ్చింది.
Also Read: మిరియాలతో ఆ సమస్యలన్నీ దూరం !
మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయినప్పటికి తరువాత వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకొని ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది ముంబై. ఈ మ్యాచ్ తో ఎలాగైనా గెలిచి టాప్ 5 లోకి ఎంట్రీ ఇవ్వాలని రోహిత్ సేన ప్రయత్నిస్తోంది. మరోవైపు గత మ్యాచ్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన పంజాబ్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా సత్తా చాటలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే నిన్న జరిగిన మ్యాచ్ లో హైదరబాద్ సన్ రైజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. హైదరబాద్ నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై అలవోకగా ఛేదించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
Also Read: IPL 2023:ఖాతా తెరచిన ఢిల్లీ