35 లక్షల పెళ్లిళ్లు..రూ.4.25 లక్షల కోట్ల ఖర్చు!

10
- Advertisement -

భారతదేశంలో పెళ్లిళ్ల కోసం చేసే ఖర్చు అంతా ఇంత కాదు. ఎందుకంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే సామేత ఉండనే ఉంది. పేద, ధనిక గొప్ప తేడా లేదు. ఇంట్లో జరిగే శుభకార్యానికి ఎంతైన ఖర్చు చేసేందుకు వెనుకాడరు. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండగా ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.

నవంబరు, డిసెంబర్ రెండు నెలల్లో 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తుండగా ఇందు కోసం ఏకంగా రూ.4.25 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.

బట్టలు, ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, అలంకరణ సామగ్రి ,కార్లు, మండపాలు, కన్వెన్షన్​ సెంటర్లు, హోటల్ బుకింగ్స్​ వరకు ప్రతీది ఖర్చుతో కూడుకున్న పనే. అందుకే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు జరుగుతుందని ఓ నివేదిక వెల్లడించింది.

దసరా పండుగ తర్వాత మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. ధనవంతులు, సెలబ్రిటీలు తమ వివాహాలను డెస్టినేషన్​ పద్దతిలో చేసుకుంటుండటంతో ఖర్చు మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా సెలబ్రెటీలు లండన్​, సింగపూర్​, దుబాయ్​ తదితర దేశాల్లో వెడ్డింగ్​లు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి సంపన్న కుటుంబాలు ఖర్చు చేసే మొత్తం ఏంతో తెలుసా అక్షరాలా రూ. లక్ష కోట్లు. మొత్తంగా మనదేశంలో పెళ్లిళ్ల కోసం చేసే ఖర్చు మరే దేశంలో చేయలేరెమో.

Also Read:ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్‌’

- Advertisement -