పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రియ..

271
Wedding Bells for Shriya Saran?
- Advertisement -

ఇటీవల వెడ్డింగ్ మాల్స్ లో పెళ్లినగలు, పట్టు చీరలు షాపింగ్ చేయడంపై హీరోయిన్ శ్రియ స్పందించింది. మార్చిలో శ్రియ పెళ్లి ఓ రష్యా యువకుడితో జరగనుందని, వీరి వివాహం రాజస్థాన్ లో జరుగుతుందని, అందుకే ఆమె భారీగా షాపింగ్ చేస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రియ మాట్లాడింది. తన స్నేహితురాలి వివాహం ఉండటంతో నగలు ఆర్డర్ ఇచ్చానని, బట్టలు కొనుగోలు చేశానని చెప్పిన శ్రియ, తన వివాహం ఇప్పట్లో కాదని చెప్పింది. వచ్చే నెల రోజుల్లో రెండు ముఖ్యమైన పెళ్లిళ్లకు తాను వెళ్లల్సి వుందని, తన షాపింగ్ కారణంగానే రూమర్స్ వచ్చాయని శ్రియ క్లారిటీ ఇచ్చింది.

shriya-saran

శ్రియ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటిన ఇప్పటికి అభిమానులకి కొత్తగానే కనిపిస్తుంటుంది. ఇటీవల గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో వశిష్టి దేవిగా నటించిన శ్రియ తన నటనతో ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ బాల‌య్య‌తో పైసా వ‌సూల్ చేసింది. ప్ర‌స్తుతం గాయ‌త్రి అనే సినిమాలో విష్ణు స‌ర‌స‌న న‌టిస్తుంది . ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది.

- Advertisement -