అశ్లీల వెబ్‌సైట్ల తొలగింపు….

257
Websites blocked in China
- Advertisement -

ఇంటర్నెట్‌లో క్లిక్‌చేస్తే… చాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పోర్న్‌ వెబ్‌సైట్స్‌. యుక్త వయసు కుర్రకారు నుంచి… పండు ముసలి వరకూ అందరూ వాటికి బానిసలుగా మారుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇదే అదనుగా.. క్యాష్‌ చేసుకునేందుకు కొందరు అశ్లీల వెబ్‌సైట్లను ప్రారంభిస్తున్నారు.

అయితే తాజాగా ప్రజలను తప్పుదోవ పట్టించే అశ్లీల వెబ్‌సైట్లపై డ్రాగన్‌ చైనా కొరడా ఝళిపించింది. అశ్లీల, అసభ్య సమాచారంతో లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రసారాలను చేస్తున్న సుమారు 4వేలకు పైగా వెబ్‌సైట్లను చైనా ప్రభుత్వం తొలగించింది. సైబర్‌స్పేస్ నిబంధనలకు విరుద్ధంగా 4వేలకు పైగా ఉన్న అశ్లీల వెబ్‌సైట్లను చైనా ప్రభుత్వం తొలగించినట్లు చైనా మీడియా వెల్లడించింది. హింస, అశ్లీల, అసభ్య సమాచారం నిండిన లైవ్‌ స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్లను చైనా మూసేవేసిందని జిన్‌ హువా న్యూస్‌ ఏజెన్సీ తన కథనంలో పేర్కొంది.

Websites blocked in China

చైనా ప్రభుత్వం నవంబర్‌లో సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి నియమ, నిబంధలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం భద్రత, అస్థిర సమాజం, సామాజిక క్రమానికి విఘాతం కలిగించడం, పోర్నోగ్రఫీతో సహా వ్యర్థ సమాచారాన్ని ఏ వెబ్‌సైటూ అందించకూడదు. చైనా రాజధాని బీజింగ్‌ వేదికగా బూతు సమాచారాన్ని ఇంటర్నెట్‌లో ఉంచుతున్న సుమారు 4వేల వెబ్‌సైట్లను ప్రభుత్వం తొలగించింది.

Websites blocked in China

నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో ఇంటర్నెట్‌ వ్యవస్థకు భద్రత కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చైనా అధికార వర్గాలు తెలిపాయి. అయితే సైట్ల పై ఆంక్షలు ఉన్నప్పటికీ సోషల్‌మీడియాలో పలువురు సైట్ల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రత్యామ్నాయ మాధ్యమాలు ద్వారా కొందరు ప్రభుత్వానికి సవాల్‌ విసురుతున్నాయి. ముఖ్యంగా 4జీ, 5జీ సౌకర్యాలతో లైవ్‌ స్ట్రీమింగ్‌ల ద్వారా కార్యక్రమాలను చూడటం చైనాలో సర్వ సాధారణమైపోయింది. దీంతో చైనా ఈకొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పోర్నోగ్రఫీ విస్తరించకుండా చేయడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం అని చైనా పెర్కొంది.

- Advertisement -