రాగల రెండు రోజులు భారీ వర్షాలు :వాతావరణ శాఖ

39
rain
- Advertisement -

తెలంగాణలో రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం వాయుగుండంగా బలపడిందని తెలపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని పేర్కొంది. ఇది బాలాసోర్‌కి తూర్పు ఆగ్నేయ దిశగా 250కి.మీ సాగర్‌ దీవులకు ఆగ్నేయ దిశగా150కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 6గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్‌ ఒడిశా తీరాల్లోని బాలాసోర్‌ సాగర్‌ద్వీపం మధ్యన ఇవాళ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్‌ జార్ఖండ్‌ ఉత్తర చత్తీస్‌గఢ్‌ మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.

- Advertisement -