రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన..

206
Weather forecast

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనను హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో 1.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం బలహీనంగా మారింది. అయినప్పటికీ దీనికి అనుబంధముగా ఉత్తర బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న బాంగ్లాదేశ్ ప్రాంతాలలో 2.1 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.