పక్క రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా.. తెలంగాణ కీలక నిర్ణయం..

37
Telangana
- Advertisement -

తెలంగాణలో క‌రోనా వైరస్‌ పూర్తిగా అదుపులోనే ఉంది.. కానీ ప‌క్క రాష్ట్రాల్లో వైరస్‌ పాజిటీవ్‌ కేసులు పెరుగుతున్నయ్‌ కాబట్టి ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ పెట్టుకోనితీరలని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు. దేశంలో ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ కూడా అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రంలో కొత్త‌గా న‌మోదవుతున్న కేసుల్లో ఏమాత్రం పెరుగుద‌ల లేకున్నా కూడా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మాస్క్ ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

helath director

ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో క‌రోనా ఫోర్త్ వేవ్‌కు అవ‌కాశం లేదు. రాష్ట్రంలో రోజుకు 20 నుంచి 25 కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్ర‌జ‌ల్లో 93 శాతం యాంటీబాడీస్‌ను గుర్తించాం. థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నాం. అయినా కూడా ఫంక్ష‌న్లు, ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు తప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే. మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా వినియోగించాలి. మాస్క్ లేకుంటే రూ.1,000 జ‌రిమానా విధించడం జరుగుతుంది అని ప్ర‌క‌టించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు నెల‌ల్లో భారీ సంఖ్య‌లో పెళ్లిళ్లు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. సీరో స‌ర్వే ప్ర‌కారం తెలంగాణ‌లో ఫోర్త్ వేవ్ రాద‌ని స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి వ్య‌క్తి మాస్కు ధ‌రించ‌డంతో పాటు, అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో కొవిడ్‌ను నియంత్రించ‌గ‌లిగాం. రాబోయే రోజుల్లో కూడా ప్ర‌జ‌ల స‌హ‌కారం అవ‌స‌రం ఉంటుంద‌న్నారు. గుంపులు, స‌మూహల్లో ఉన్న‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాలి. రాష్ట్రంలో క‌రోనా కంట్రోల్‌లో ఉండ‌టానికి కార‌ణం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌నే అని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -