కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా:ఆర్‌ఎస్పీ

17
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి పనిచేస్తానని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్..చాలా బాధతో బీఎస్పి పార్టీకి రాజీనామా చేశాను అన్నారు.మాయావతి ఆశీర్వాదంతో నల్గొండ సభలో బీఎస్పిలో చేరాను…4,000 గ్రామాల్లో పర్యటనలు చేశాను అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పి అభ్యర్థిగా నేను పోటీ చేయడమే కాకుండా 107 అభ్యర్థులను బరిలో నిలిపానని…పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలతో కాకుండా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాము…అందరితో చర్చించి బిఆర్ఎస్,బీఎస్పీ పొత్తుపై నిర్ణయం తీసుకున్నామన్నారు.

దేశంలో బీజేపీ గేలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని అంటున్నారు…మాకు కేసీఆర్ రెండు సీట్లు కేటాయించారు…బీఎస్పి జాతీయ నాయకత్వం సైతం అంగీకరించిందన్నారు. బిఆర్ఎస్, బీఎస్పి పొత్తు నచ్చని బీజేపీ బీఎస్పిపై ఒత్తిడి తీసుకువచ్చి పొత్తును రద్దు చేశారని..ప్రెస్ మీట్ పెట్టి పొత్తును రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని బీఎస్పి హై కమాండ్ నుండి ఆదేశాలు వచ్చాయని…నేను ఐ.పి.ఎ.స్ ఆఫీసర్ గా దేశం కోసం పని చేశాను…నాకు బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మాయావతికి ధన్యవాదాలు అన్నారు.

ఎన్నటికీ బహుజన వాదాన్ని వీడనని..తెలంగాణ ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నాను అన్నారు.కేసీఆర్ కు పొత్తుపై మాట ఇచ్చాను…అందుకే మాట తప్పను..నా శ్రేయోభిలాషులతో చర్చలు జరిపి రాజకీయంగా నిర్ణయం తీసుకుంటాను అన్నారు.ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్ తో చర్చించాను..రాబోయే రోజుల్లో కేసీఆర్ తో,బిఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తాను అన్నారు.

Also Read:మే 13న పోలింగ్..జూన్‌ 4న కౌటింగ్

- Advertisement -