ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల కస్టడీ..

19
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఏడు రోజుల కస్టడి విధించింది రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల అనంతరం కవితను న్యాయస్ధానంలో హాజరు పర్చగా మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి.

23న తిరిగి న్యాయస్ధానంలో హాజరు పర్చాలని…ప్రతి రోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుండి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, ఈడీ తరపున ఎన్‌కె మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు.

Also Read:కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా:ఆర్‌ఎస్పీ

- Advertisement -