కాకతీయుల చరిత్ర భావి తరాలకు అందిస్తాం : శ్రీనివాస్‌ గౌడ్‌

23
warangal
- Advertisement -

తెలంగాణను పరిపాలించిన కాకతీయ సామ్రాజ్య పునర్‌ వైభవాన్ని ప్రపంచాన్ని చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం కాకతీయ సప్తాహాన్ని నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలకు కాకతీయ 22వతరం వారసుడు కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ ముఖ్య అతిథీ గా పాల్గోంటున్నరు. కాకతీయ వారసుడుభంజ్‌దేవ్‌ ఇవాళ ఉదయం వరంగల్‌కు చేరుకొని భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. మావంశస్థుల గడ్డకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా అమ్మ దగ్గరికి వచ్చినంత అనందంగా ఉందన్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే మా ల‌క్ష్యమని పేర్కొన్నారు. బ‌స్త‌ర్‌లో త‌మ సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయ‌న్నారు. కాక‌తీయ ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. త‌న‌ను ఆహ్వానించిన నాయ‌కుల‌కు క‌మ‌ల్ చంద్ర భంజ్‌దేవ్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు చెప్పారు.

కాక‌తీయుల చ‌రిత్ర‌ను భావిత‌రాల‌కు తెలియ‌జేస్తామ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ఉత్సవాలకు కాకతీయ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తెలంగాణ చ‌రిత్ర‌ను కాపాడే ప్ర‌య‌త్నం ప్రభుత్వం చేస్తుంద‌ని హామినిచ్చారు. వ‌రంగ‌ల్ అంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అమిత‌మైన ప్రేమ అని తెలిపారు. కాక‌తీయుల ఆద‌ర్శంతోనే మిషన్‌ కాకతీయ లాంటి బృహత్‌ కార్యక్రమాన్ని చెపట్టి చెరువుల‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వాలు కాక‌తీయుల చ‌రిత్ర‌ను మ‌రుగున ప‌డేలా చేశాయ‌న్నారు. కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో కాక‌తీయుల చ‌రిత్ర ప్ర‌పంచానికి తెలిసింద‌న్నారు.

కాకతీయులు నిర్మించిన చెరువులను ఆదర్శంతో పల్లెల్లోని చెరువులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాక‌తీయుల గ‌డ్డ‌పై పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ స్ప‌ష్టం చేశారు. కాక‌తీయుల పాల‌న ప్రస్తుత ప్ర‌భుత్వాల‌కు స్ఫూర్తిగా నిలుస్తుంద‌న్నారు. కాక‌తీయ ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

- Advertisement -