Modi:తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం

20
- Advertisement -

అభివృద్ధిలో రాష్ట్ర సర్కార్ కు పూర్తి సహకారం అందిస్తాం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని….తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.

సోమవారం ఆదిలాబాద్‌‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు పీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు.

రాష్ట్రాభివృద్ధికి , తెలంగాణ ప్రభుత్వం కు, సీఎం రేవంత్‌ రెడ్డి కి సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు.తెలంగాణలో గడిచిన పదేళ్లలో వేల కోట్లకుపైగా పనులు ప్రారంభించామన్నారు. ఎన్‌టీపీసీ రెండో యూనిట్‌ ప్రారంభించామని చెప్పారు. దీంతో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.

Also Read:KTR:ఉచిత ఎల్‌ఆర్‌ఎస్ ఏమైంది?

- Advertisement -