యాసంగిలో ప్రతి గింజ కొన్నాం: గంగుల

43
- Advertisement -

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగిలో రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేసినట్టు మంత్రి గంగుల కమాలాకర్‌ అన్నారు. తాజాగా పత్రిక ప్రకటనలో తెలంగాణలో ధాన్యం సేకరణ వివరాలతో కూడిన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈమేరకు ఒక్క రోజే రైతుల ఖాతాల్లోకి రూ.3000కోట్లు విడుదల చేసామని…మిగిలిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి ఈ నెల 20వ తేదీలోగా అందజేస్తామని అన్నారు.

ఈ యాసంగిలో గురువారం నాటికి 64.52లక్షల మెట్రికట్‌ టన్నుల ధాన్యాన్ని 11లక్షల మంది రైతుల దగ్గర నుంచి సేకరించినట్టు తెలిపారు. వీటి విలువ 13,264కోట్లన్నారు. ఆకాల వర్షాల వంటి విపత్కర పరిస్థితులను ముందుగా అంచనా వేసి పదిరోజులు ముందుగానే కొనుగోలు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా గతంలో కన్నా ఈ సారి అధికంగా 7034కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించినట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 90శాతానికి పైగా కొనుగోలు సేకరణ పూర్తి చేసినట్టు తెలిపారు. అలాగే 6143సెంటర్లు మూసివేసినట్టు అన్నారు. ఇందులో 18జిల్లాలో కొనుగోలు కేంద్రాలు సంపూర్ణంగా పూర్తైనట్టుగా తెలిపారు. ఎక్కడైనా ఆలస్యంగా కోతలు చేసిన ప్రాంతాల రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లు చేసేందుకు వీలుగా కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చామన్నారు. గత సీజన్ కన్నా 15లక్షల మెట్రిక్ టన్నులను అధికంగా సేకరించామని మంత్రి గంగుల తెలియజేసారు.

రైతు అనుకూల విధానాలతో రైతుబంధు, 24గంటల ఉచిత విద్యుత్‌ పంపిణీతో రాష్ట్రంలో వరి ధాన్యం పంట ఉత్పత్తి పెరిగిందన్నారు. యాసంగిలో రాష్ట్రంలో 56.845లక్షల ఎకరాల్లో వరిపంట సాగైందని తెలిపారు. కేవలం తొమ్మిదేళ్లలోనే దేశానికి అన్నపూర్ణగా మారి, దేశంలో నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. విపత్కర పరిస్థితులలో కూడా ధాన్యం సేకరణ ఆపలేదని తెలిపారు.

Also Read: KTR:సుపరిపాలన కోసమే వార్డు కార్యాలయం

ఆకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినట్టు తెలిపారు. అవసరమైన మేర టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు పెద్ద ఎత్తున తెరిచిన సేకరణ కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్లు, వెయింగ్ మిషన్లు, ప్యాడీక్లీనర్లు వంటి మౌళిక వసతులను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. యాసంగి ధాన్యం సేకరణలో పాల్గొన్న హమాలీలకు, సహకార సంఘాలకు, మిల్లర్లకు, అధికార యంత్రాంగానికి ప్రతీ ఒక్కరికీ మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ణతలు తెలియజేసారు.

Also Read: బి‌ఆర్‌ఎస్.. సింగిల్ గానే బరిలోకి ?

- Advertisement -