అభివృద్ధిలో తెలంగాణ నెంబర్.. 1

215
KCR
- Advertisement -

అభివృద్ధిలో ఆంధ్ర,తెలంగాణకు చాలా తేడా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. విభజనకు ముందు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూనే అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ 1గా నిలిచిందన్నారు. పార్క్ హయాత్ హోటల్‌లో ఇండియా టుడే సౌతా కాన్ క్లేవ్ 2018లో పాల్గొన్న సీఎం ఆర్ధిక వృద్దిరేటులో ఇదే ఒరవడిని కొనసాగిస్తామని తెలిపారు. భాష ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్ర-తెలంగాణ విలీనం చారిత్రాక తప్పిదమని సీఎం తెలిపారు. నిజాం హయాంలోనే తెలంగాణ ఆర్ధికంగా వృద్ది చెందిందన్నారు.

తెలంగాణను పునర్ నిర్మిస్తునే దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యామని తెలిపారు. 300 ఏళ్ల క్రితం వచ్చిన మార్వాడీలు తెలంగాణను తమ మాతృభూమిగా చెప్పుకుంటారని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడితే దేశంలోనే ధనిక రాష్ట్రంగా వృద్ధి చెందుతుందని ఆనాడే చెప్పానని తెలిపారు. దేశంలో తెలంగాణ కంటే 17 చిన్న రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. రక్తం చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు.

విభజన సమయంలో తమకు ఎలాంటి అనుమానాలు లేవని పట్టుదలతో అభివృద్ది సాధించి ఆచరణలో చూపామని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన మాణాలు,సంస్కృతి,సంప్రదాయాలు, భాష వేరని తెలిపారు.హైదరాబాద్‌లో ఎన్నో మతాల వాళ్లు ఎన్నో ప్రాంతాల వాళ్లు భాగమై జీవిస్తున్నారని తెలిపారు.

దేశంలో 24 గంటల కరెంట్‌ను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. స్వల్పకాలంలోనే విద్యుత్ సమస్య నుంచి బయటపడ్డామని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందన్నారు.

సంక్షేమ పథకాల కోసమే రూ.45 వేల కోట్ల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలవనుందన్నారు. ఇరిగేషన్‌లో తెలంగాణ అద్బుతాలు సృష్టించిందని పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసిందన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించడానికి అన్నిచర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 2020 నాటికి తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారబోతుందన్నారు.

రైతులకు ఎరువులను సకాలంలో అందజేస్తున్నామని చెప్పారు. 71 లక్షల మంది రైతులకు ఈ సంవత్సరం నుంచి ఎకరాకు 8వేలకు పెట్టుబడి అందచేసే కార్యక్రామానికి శ్రీకారం చుట్టామన్నారు. రైతు సమన్వయ సమితిలతో రైతుల బ్రతుకుల్లో మార్పులు తీసుకురానున్నాయని తెలిపారు.

- Advertisement -