ఛలో మూవీ ట్రైలర్ రిలీజ్

211
Chalo-Movie-Official-Teaser-
- Advertisement -

యంగ్ స్టార్ నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘ఛలో’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. వెంకీ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ‘ఛలో’ సినిమాను నాగశౌర్య అమ్మనాన్నలు ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ట్రైలర్ లో ఏం చూపించారంటే.. బోర్డర్లో పక్కపక్కనే ఉన్న రెండు ఊళ్లు. ఒకటి తెలుగోళ్ల విలేజ్ అయితే రెండోది తమిలోళ్ల గ్రామం. అందుకే ఆ ఊళ్ళ మధ్యలోనుండి బోర్డర్ తెలిసేలా ఒక ఫెన్సింగ్. అలాంటి చోటుకు ఆ ఊళ్ళ తాలూకు గొడవల గురించి తెలియని హీరో వెళితే ఎలా ఉంటుంది? మంచి ఆసక్తికరమైన కథా కథనంతో ఇప్పుడు నాగ శౌర్య డిఫరెంట్ కథను మరోసారి ఎన్నుకున్నాడని ఇక్కడే అర్ధమవుతోంది.

Chalo-Movie-Official-Teaser-

ట్రైలర్ మొత్తంలో ఆ ఊళ్ళ తాలూకు గొడవలు.. అలాగే వాటిని కామెడీగా సినిమాల ద్వారా చెప్పడం.. అదిరిపోయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాగశౌర్య సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు. కామెడీ, యాక్షన్ సమ్మిళితంగా ఈ సినిమా వస్తోంది.

- Advertisement -