ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం: బండి సంజయ్

11
- Advertisement -

ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. బీసీలకు అన్యాయం చేసి ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అన్నారు.

కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించింది కామారెడ్డి డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ అని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే మద్దతిస్తాం..
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని ప్రధానిని చేశారా..? చెప్పాలన్నారు.

ఉమ్మడి ఏపీలో 48 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క బీసీనైనా సీఎంను చేసిందా?,27 మంది ఎంపీలను మంత్రులుగా, అనేక రాష్ట్రాలకు బీసీలను సీఎంలుగా నియమించిన ఘనత బీజేపీది అన్నారు.

- Advertisement -