- Advertisement -
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ నుండి భారత్ తప్పుకుంది. విండీస్ పై విజయంతో సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది భారత్. అయితే సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉండటంతో పాక్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఆడబోమని భారత ఆటగాళ్లు స్పష్టం చేశారు.
భారత్ తప్పుకోవడంతో పాకిస్తాన్ నేరుగా ఫైనల్‌కి చేరింది. దీంతో టోర్నీ నిర్వాహకులు గ్రూపు దశలో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు.
టీమ్ఇండియా సెమీస్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో పాక్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతో శనివారం పాక్ ఫైనల్ ఆడనుంది.
Also Read:కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
- Advertisement -

