బీచుపల్లిలో వే – సైడ్ మార్కెట్….

383
niranjan reddy

హైదరాబాద్ జాతీయ రహదారిపై బీచుపల్లి వద్ద రెండెకరాలలో “వే – సైడ్” మార్కెట్ (ఆధునిక రైతుబజార్) ఏర్పాటు చేయనున్నామని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.

ఈ ఆధునిక రైతుబజార్ కోసం తెలంగాణ ఆయిల్ ఫెడ్ కు చెందిన 2 ఎకరాలు కేటాయించారు. భూ కేటాయింపుపై తగిన చర్యలు తీసుకోవాలని జోగుళాంబ – గద్వాల జిల్లా కలెక్టర్ కు ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్ – కర్నూలు జాతీయ రహదారిపై టాయిలెట్ వసతులతో కూడిన ఈ మార్కెట్‌లో రైతులు తాము స్వయంగా పండించిన కూరగాయలను .ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. త్వరలోవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్ధాపన చేయనున్నారు.

Telangana agriculture minister singireddy niranjan reddy to inagurate way side market at Beechupalli