వేసవిలోనూ మెరిసే అందం కోసం..

259
- Advertisement -

వేసవికాలం అనగానే గుర్తుకు వచ్చే పండ్లల్లో ఒకటి పుచ్చపండు… ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి.

1. నేచురల్ టోనర్: ఈ ఎర్రని, జ్యూసీ ఫ్రూట్ నేచురల్ ఆస్ట్రిజెంట్ చర్మం రంగును మార్చుతుంది. అందుకు ఈ కర్జూజ గుజ్జును ముఖానకి మర్ధనా చేయాలి. ఈ తాజా వాటర్ మెలోన్ లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.ఇది ఆయిల్ చర్మానికి నేచురల్ గా పనిచేస్తుంది.

2. ఓల్డ్ షేడ్స్ నివారించేందుకు : వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అంలాగే యాంటీఆక్సిడెంట్స్ కూడా ముడతలను, కళ్ళ క్రింద చారలను తొలగిస్తుంది.

3. శరీరానికి తేమను అందిస్తుంది: వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి.డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి.

4. ఆయిల్ చర్మానికి : ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మలోపల ఉన్న నూనె మగ్రంధులను తగ్గిస్తుంది. దాంతో ముఖంలో జిడ్డు కూడా తగ్గి ముఖం తాజాగా ఉంటుంది. ఈ సీజన్ లో మీకు అతి సులభంగా, చౌకగా దొరికే ఈ పండును తీసుకొచ్చి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా సొంతం చేసుకోవచ్చు.

Also Read:సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడగింపు..

- Advertisement -