పుచ్చకాయ అతిగా తింటున్నారా?

14
- Advertisement -

 వేసవికాలం వచ్చిందంటే ఎక్కడ చూసిన పుచ్చకాయలు ( వాటర్ మిలాన్ ) కనిపిస్తుంటాయి. వేసవి తాపాన్ని తగ్గించడంలో ఏవి ఎంతో సహాయ పడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఏ, కె, డి, బి3, బి6, బి12 వంటి పోషకాలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, క్లోరిన్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. .

ఇంకా ఇందులో ఉండే బీటాకెరోటిన్, ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయ పడతాయి. పుచ్చకాయను తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు పుచ్చకాయ నిరభ్యంతరంగా తినవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా పుచ్చకాయ ద్వారా మూత్ర విసర్జన, జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పుచ్చకాయను చాలమంది అతిగా తింటూ ఉంటారు. ఇలా అతిగా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

వాటల్ మిలాన్ ను ఎక్కువగా తింటే విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా కడుపు నొప్పి, వాంతులు, అజీర్తి వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. కొంతమంది సగం పండు తిని మిగిలిన సగం పండు మరుసటి రోజు తినడం లేదా ఫ్రిడ్జ్ లో దాచుకొని అప్పుడప్పుడు తినడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల న్యుమోనియా వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయకు దూరంగా ఉండడం ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఫ్రక్టోజ్ రక్తంలో షుగర్ లెవల్స్ ను పెంచే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:KTR:నిరుద్యోగ భృతి ఏది?

- Advertisement -